కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యూనియ న్ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్లను శుక్రవా రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 7 నుంచి 9 వరకు మెద క్ పట్టణంలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి, సహాయ కార్యదర్శులు సురేందర్, పొచ్చన్న, నగేశ్, స్వామి, రాకేష్, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


