నేల సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: నేల సంరక్షణ అందరి బాధ్య త అని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదిలా బాద్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన స్థానం, సీపీఎఫ్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సారవంతమై న, కాలుష్యం లేని నేలను అందించాలంటే ర సాయనాల అధిక వాడకాన్ని తగ్గించి, నేలలో కరగని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాలన్నా రు. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్, హెచ్‌వోడీ డాక్టర్ జి.మంజులత, కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్, సీపీఎఫ్ ఎన్జీవో ప్రతినిధి సుదర్శన్, జి.అనిత, డి.కుమారస్వామి, సుధాన్షు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


