‘రైతుల ఇబ్బందులకు కేంద్రమే కారణం’
ఆదిలాబాద్: పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. పత్తి రైతులపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థాని క ఎంపీ గోడం నగేశ్ ఇంటిని ముట్టడించారు. పార్టీ నాయకులను నిలువరించేందుకు పోలీ సులు యత్నించగా తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, తేమ నిబంధన లేకుండా పత్తిని కొనుగోలు చే యాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎ న్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాజాగా ఎకరానికి ఏడు క్వింటాళ్లు మా త్రమే సీసీఐ కొనుగోలు చేయాలనే నిబంధనతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీఐ నిబంధనలు సడలించేలా చొరవ చూపాల్సింది పోయి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు వాటిని సమర్థించ డం ఏంటని మండిపడ్డారు. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు అండగా నిలవా లన్నారు. పోలీసులు నాయకులను అరెస్టు చేసి ఆదిలాబాద్‌రూరల్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జోగు ప్రేమేందర్, నాయకులు నారాయణ, అజయ్, రమేశ్, పవన్‌నాయక్, సతీష్, ధమ్మపాల్, ప్రకాశ్, శివ, జగదీష్, ప్రశాంత్, తిరుపతి, దేవిదాస్, వసంత్ పాల్గొన్నారు.


