వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి వేళలో మంచుప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ప్రజలతో మమేకమై.. సమస్యలపై ఆరా తీసి
కై లాస్‌నగర్: వృత్తిపరమైన శిక్షణ నిమిత్తం జిల్లాకు విచ్చేసిన 16 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు. తొలుత మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రత్యేకాధికారి చాంబర్‌లో వారితో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషనర్ రాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఫిల్టర్‌బెడ్, బంగారుగూడలోని పలు వార్డులతోపాటు డంపింగ్ యార్డును పరిశీలించారు. వాటి నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి పట్టణంలోని కోలిపూరకు చేరుకున్న అధికారులు కాలనీలోని స్వయం సహా యక సంఘాల మహిళలతో మాట్లాడారు. వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, సమస్యలపై ఆరా తీశారు. వారి వెంట ట్రెయినీ కలెక్టర్ సలోని, మున్సిపల్ అధికారులున్నారు.


