పనులు వేగవంతం చేయండి
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతు న్న రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ), ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్ట ర్ క్యాంప్ కార్యాలయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి రైల్వే, రహదారులు,భవనాలు, ము న్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, జిల్లా కేంద్రంలోని రైల్వేలెవల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు ఆర్‌యూబీ, ఆర్‌వోబీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.94 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రెండు ప్రా జెక్టులు భూసేకరణ, సాంకేతిక అనుమతుల దశలో ఉన్నాయని వెల్లడించారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించి 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో రైల్వేసీనియర్ ఇంజినీర్ సాంబశివరావు, ఆర్‌అండ్‌బీ అధికారులు నర్సయ్య, రాజేశ్వర్,ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సే వలు అందించాలని కలెక్టర్ రాజార్షిషా అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్షించారు. ఉట్నూర్, బోథ్, బేల, గాదిగూడ వంటి దూర ప్రాంతాల మహిళలు, గర్భిణులకు మెరుగైన వైద్యసేవల కోసం రిమ్స్‌కు తరలించాలన్నారు. జిల్లాలో ఐరన్ లోపం, ఎనీమియాతో బాధపడుతున్న మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అలాగే నవజాత శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శిశు సంక్షేమ, వైద్య శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ స్థాయిలో తల్లుల ఆరోగ్య స్థితి, హెచ్‌బీ స్థాయి, పోషకాహార పంపిణీ వంటి అంశాలను సమీక్షించి హైరిస్క్ కేసుల జాబితా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


