కార్తికం.. కమనీయం
కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామున ఇళ్లలో తులసీపూజలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో బుధవారం నిర్వహించిన దీపోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆనవాయితీగా నిర్వహిస్తున్న కాకడహారతిలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. జైనథ్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. జిల్లాలోని పలు ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. – ఆదిలాబాద్/జైనథ్


