
ఆవులు తరలిస్తున్న లారీ పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని చెక్‌పోస్ట్ వద్ద ఆవులు తరలిస్తున్న కంటైనర్ లారీని పట్టుకున్నట్లు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. శనివారం నాగ్‌పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటైనర్‌ను తనిఖీ చేయడంతో 25 ఆవులు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్సైకి సమాచారం సమాచారం అందించడంతో ఆవులను ఇచ్చోడలోని గోశాలకు తరలించారు. డ్రైవర్ గురురవాల్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోహన్‌గౌడ్, పైమా సుల్తానా, జాదవ్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు.