
స్వర్ణ వాగులో పడి ఒకరు మృతి
సారంగపూర్: ప్రమాదవశాత్తు స్వర్ణ వాగులోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ప్యారమూర్ గ్రామానికి చెందిన పగడపు భోజన్న (59) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. బోరిగాంలో ఉంటున్న అతని అక్క పోశవ్వ మూడు రోజుల క్రితం తన ఇంటికి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భోజన్న తిరిగిరాలేదు. శనివారం స్వర్ణ వాగులో మృతదేహం కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా న్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.