ఉట్నూర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ నెల 17న నిర్వహించిన జాతీయ సదస్సులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్‌తో పాటు జిల్లా మాస్టర్ ట్రైనర్లు అర్క వసంత్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్‌లు రాజేశ్‌బాబు, నందకిషోర్ పాల్గొన్నట్లు తెలిపారు. పథకాల అమలులో వారు చేసిన కృషికి పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు.