
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు
ఆదిలాబాద్‌టౌన్: సరైన సమయంలో సీపీఆర్ చేసినట్‌లైతే హార్ట్‌ఎటాక్ వచ్చిన వారి ప్రాణాలను కాపాడవచ్చని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, ప్రభుత్వ డైట్ కళాశాల, రిమ్స్ ఆసుపత్రిలో సీపీఆర్‌పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండెపోటు వచ్చిన పది మందిలో ఒకరు మాత్రమే ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో బతుకుతున్నారన్నారు. వారికి సరైన సమయంలో సీపీఆర్ అందించినట్లయితే సగం మందిని కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంవో శ్రీధర్, రిమ్స్ వైద్యులు నరేందర్ , డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అనిత తదితరులు పాల్గొన్నారు.