
ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి
భీంపూర్: ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని భగవాన్‌పూర్ గ్రామంలో బుధవారం దండారీ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీకి గ్రామస్తులు సంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుస్సాడీ వేషధారణతో ఎస్పీ నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నారు. అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్, ఎస్సై విక్రమ్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.