
పుంజుకున్న ఎక్సైజ్ దరఖాస్తులు
ఆదిలాబాద్‌టౌన్: మద్యం షాపుల టెండర్లు పుంజుకున్నాయి. గత నెల 26న నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 14 వరకు కేవలం 50 వరకు దరఖా స్తులు అందాయి. అయితే బుధవారం ఒక్క రోజే 52 దాఖలు కావడం గమనార్హం. ఈ ఏడాది దరఖా స్తు ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. 2023లో 40 వైన్స్‌షాపులకు 1,047 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు కేవలం 110 మాత్రమే వ చ్చాయి. అయితే ఈ ఏడాది ఆ స్థాయిలో అందుతా యా లేదా అనే దానిపై చర్చ సాగుతుంది. బుధవా రం ఆదిలాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 21, ఇచ్చో డ స్టేషన్ పరిధిలో 12, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 19 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో 61, ఇచ్చోడ పరిధిలో 20, ఉట్నూర్ పరిధిలో 29 దరఖాస్తులు అందినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు.
ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు నిల్..
ఆదిలాబాద్ పట్టణంలోని 2, 4, 7, 10, 12, 14, 16, 17, 18 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. అలాగే ఇచ్చోడ పరిధిలో 24, 25, 26, 27, 28, 30, 31 షాపులకు, ఉట్నూర్ పరిధిలో 34, 35, 36, 40 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ పట్టణంలో షాపులవారీగా కేటాయించిన స్థలంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండేది. అయితే ఈ సారి జిల్లాకేంద్రంలో షాపులు దక్కించుకున్న వారు తమకు ఇష్టమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ వ్యాపారులు అంతగా ఆసక్తి చూపకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దరఖాస్తుల ద్వారానే గతేడాది ప్రభుత్వానికి రూ.20 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.