
దాడి కేసులో నలుగురి రిమాండ్
జైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్‌తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.