
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్మాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు.