
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్‌రూరల్: విధి నిర్వహణలో ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. ఈ నెల 21న ఫ్లాగ్‌డే వారో త్సవాల్లో భాగంగా ఉట్నూర్‌లో పోలీస్ అమరవీరుడు ఆర్.శంకర్ స్మారక భవనంను అదనపు ఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, అమరవీరుడు శంకర్ భార్య దూరిబాయ్, ఎస్సైలు సాయన్న, ప్రవీ ణ్, అఖిల్, సిబ్బంది పాల్గొన్నారు.