
పల్లెల్లో వసతులపై సర్వే
అందుబాటులోకి జీపీ మానిటరింగ్ యాప్ వివరాల సేకరణలో కార్యదర్శులు నిమగ్నం పంచాయతీ అభివృద్ధికి దోహదపడే అవకాశం
నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెంచింది. ప్రతీ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులు గుర్తించేందుకు గాను గత నెల 18 నుంచి సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కార్యదర్శులు ఆయా జీపీల్లో మౌలిక వసతుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొ త్తం 473 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని చో ట్ల సర్వే చేపడుతున్నారు. కొద్ది నెలలుగా పంచా యతీ పాలకవర్గాలు లేకపోవడం, అలాగే నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వే ద్వారా గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయనుంది. తద్వారా పల్లె అభివృద్ధికి దోహదపడనుంది.
సమగ్ర సమాచారం సేకరణ..
ఈ సర్వే ద్వారా గ్రామాల్లో మొత్తం 21 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా ప్రతీ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో డేటా నమోదు చేయాలి. పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, వైకుంఠదామం, తాగునీరు, వీధిదీపాలు వంటి ప్రాథమిక వసతులు ఉన్నాయా లేదా పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. దీంతో వసతుల స్థాయి, ప్రజా అవసరాల స్థితి, భవిష్యత్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
అభివృద్ధికి పునాది..
గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ స్థితి, అభివృద్ధి అవకాశాలు, ప్రజా వసతుల లోపాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర అవగాహన లభిస్తుంది. తద్వారా రాబోయే అభివృద్ధి ప్రణాళికల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
21 అంశాలపై పరిశీలన..
గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని ఆయా పంచాయతీల కార్యదర్శులకు సర్వే తీరుతెన్నులను వివరించాం. 21 అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను జీపీ మానిటరింగ్ యాప్‌లో పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించాం.
– రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి