
అనైక్యతతోనే పార్టీ ఓటమి
కై లాస్‌నగర్: కాంగ్రెస్‌కు ప్రజల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, అయితే నాయకుల్లో అనైక్యతే పార్టీ ఓటమికి కారణమవుతుందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. పట్టణ శివారులోని గాయత్రి గార్డెన్‌లో జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియపై మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ, మండల నాయకులు హాజరయ్యా రు. వారందరి నుంచి వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు చేరువైందన్నారు. వారి మద్దతుతో రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు సేకరించి అందరి ఆమోదం మేరకే జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సంఘటన్ శ్రుజన్ అభియాన్ సమన్వయ కర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంభూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్ నరేశ్‌జాదవ్, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడె గజేందర్ తదితరులు పాల్గొన్నారు.