
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కైలాస్‌నగర్: వినియోగదారులకు నిరంతర నాణ్య మైన విద్యుత్ అందించాలని ఎన్‌పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విద్యుత్‌శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్, సరఫరా, ఇబ్బందులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, 33కేవీ 11కేవీ లైన్స్‌లో పెట్రోలింగ్ నిర్వహించి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. అన్ని సర్వీసులను ట్రాన్స్‌ఫార్మర్‌ల మీద మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న, వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉన్న లైన్స్‌ను గుర్తించి వెంటనే సరి చేయాలన్నారు. రోజువారీగా ఆ డేటాను యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సెక్షన్ ఆఫీసర్ వారానికి ఒక గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అగ్రికల్చర్ సర్వీసులను వెంటనే రిలీజ్ చేయాలన్నా రు. సమావేశంలో ఆపరేషన్ సీఈ అశోక్, సీఈ కన్‌స్ట్రక్షన్ జే.ఆర్.చౌహాన్, సర్కిల్ పరిధిలోని డివిజనల్ ఇంజినీర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివి జనల్ ఇంజినీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్, సబ్ ఇంజినీర్స్ తదితరులు పాల్గొన్నారు.