
ఏటీసీల్లో యువతకు శిక్షణ
ఉట్నూర్‌రూరల్: ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేసి యువతకు ఆధునిక సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం కేబీ ప్రాంగణంలోని అ డ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించి ని ర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా యువతకు సాంకేతిక శిక్షణ ఇ చ్చేందుకు ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్య కోర్సులు అందిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను ఆదేశించారు.