
ఘనంగా పోస్టల్ దినోత్సవం
ఆదిలాబాద్: తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కా ర్యాలయంలో పోస్ట్‌మాస్టర్లను సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు జనగం సంతోష్ మాట్లాడుతూ.. 70ఏళ్లుగా పోస్టల్‌శాఖ సేవలందిస్తోందని, ప్రస్తుత మొబైల్ ఫోన్ల యుగంలోనూ అధునాతన సేవలు అందిస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. యూనియన్ ప్రతినిధులు దుర్గం రాజేశ్వర్, రాఘవేంద్రనాథ్ యాదవ్, రాంకిషన్, అమర్, జార్జ్, జగదీశ్, అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.