● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామన్న ప్రభుత్వం ● సర్కారుపై విపక్షాల విమర్శలు ● ఆదరిస్తేనే మద్దతు: బీసీ నేతలు | - | Sakshi
Sakshi News home page

● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామన్న ప్రభుత్వం ● సర్కారుపై విపక్షాల విమర్శలు ● ఆదరిస్తేనే మద్దతు: బీసీ నేతలు

Oct 10 2025 7:50 AM | Updated on Oct 10 2025 7:50 AM

● జీవ

● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామ

● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామన్న ప్రభుత్వం ● సర్కారుపై విపక్షాల విమర్శలు ● ఆదరిస్తేనే మద్దతు: బీసీ నేతలు

సాక్షి, ఆదిలాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు తా త్కాలిక బ్రేక్‌ పడింది. బీసీ రిజర్వేషన్ల జీవో 9, ‘పరిషత్‌’ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఆయా రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయినప్పటికీ హైకోర్టులో విచారణ ఉండడంతో ఎన్నికలు జరుగుతాయా.. లేదా? అనే సందేహం ఓ వైపు ఉంటే, నామినేషన్‌ వేయాలా.. వద్దా? అనే సంశయం ఆశావహుల్లో నెలకొంది. ఈ సందిగ్ధంలోనూ బజార్‌హత్నూర్‌ మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదొక్కటే నామినేషన్‌ దాఖలు కావడం గమనార్హం. మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభం కావడం, ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ ఎన్నికలు నిలిచిపోతున్నాయని తెలియడంతో ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమైంది.

సర్కారు ఎలా ముందుకెళ్తుందో!

జిల్లాలో మొదటి విడతలో 10 జెడ్పీటీసీ, 80 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం ఇందుకు సంబంధించి గురువారం ఉద యం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత హై కోర్టు స్టే నేపథ్యంలో ఎన్నికలు నిలిచిపోయాయి. జీవో నంబర్‌ 9కి సంబంధించి స్టే ఇవ్వగా ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిచిపోయినట్టేనని స్పష్టమైంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ కూడా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఎన్నికలు నిలిపివేస్తామని, ‘కోడ్‌’ తొలగిస్తామని ప్ర కటించడంతో ప్రస్తుతం జారీ చేసిన రిజర్వేషన్లకు అ నుగుణంగా ఈ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని స్పష్టమైంది. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా.. లేనిపక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు మళ్లీ షెడ్యూల్‌ జారీ చేస్తుందా.. ఇలా వివిధ సందేహాల మధ్య ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషనైతే నిలిచిపోయింది.

ఆరోపణలు.. ప్రత్యారోపణలు

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పనలో అధికార కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆరో పించాయి. ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువడ్డాక సాయంత్రం ఆయా పార్టీల నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు పూర్తి చిత్తశుద్ధి ఉందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా, బీసీ కులాలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలనే ఆదరిస్తామని జిల్లాకు చెందిన బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామ1
1/1

● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement