
‘ఇందిరమ్మ’కు ఉపాధిహామీ
కై లాస్‌నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆ శించిన స్థాయిలో ముందుగుసాగడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థికభారం త గ్గించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ స్కీంకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చే సింది. తాజా నిర్ణయంతో జాబ్‌కార్డు కలిగిన కూ లీలకు అదనపు ప్రయోజనం కలిగి ఆర్థిక సాంత్వన చేకూరనుంది. సర్కారు నిర్ణయంపై ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నిర్మాణాలు వేగవంతం చేసేలా..
ఇందిరమ్మ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.5లక్షల చొప్పున చెల్లిస్తోంది. ఇళ్ల నిర్మాణ దశలను అనుసరించి బిల్లులు చెల్లించనుంది. బేస్మెంట్ దశలో రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు పూర్తయితే రూ.2లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగాక రూ.లక్ష చొప్పున నాలుగు విడతల్లో అందజేస్తోంది. లబ్ధిదారులు ఆర్థి కంగా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష చొ ప్పున తక్షణమే ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని భావిస్తోంది.
అదనపు లబ్ధి చేకూర్చేందుకే..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ఉపాధి కూలీలకు 90రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది. రోజుకు రూ.307 చొప్పున 90రోజుల పనిదినాలకు గాను రూ.27,630 వారికి అదనంగా లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. అయితే బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 20రోజుల పాటు పని కల్పించనుంది. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బేస్మెంట్ వరకు నిర్ణీత 90రోజుల పనిదినాలు పూర్తయితే మిగతా పనిదినాలను వచ్చే ఆర్థికసంవత్సరంలో ఇచ్చే వెసులుబాటు కల్పించింది. కూలీల వేతనాల చెల్లింపు కోసం నిర్మాణ పనుల్లోని మూడు దశల్లో లబ్ధిదారుడి ఫొటోలు తీసుకుని వాటిని ఆన్‌లైన్‌లో హౌసింగ్‌శాఖ అధికారులు ఆప్‌లోడ్ చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత పంచాయ తీ సెక్రటరీ దాన్ని ధ్రువీకరించినట్లయితే దాని ఆధారంగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో బిల్లులు జమకానున్నాయి. తద్వారా లబ్ధిదారు ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేసుకోవడంతో పాటు కూలీలకు చెల్లించే ఆర్థికభారాన్ని తగ్గించుకోన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు
మంజూరైన ఇళ్లు 15,486
మార్కౌట్ ఇచ్చినవి 7,763
బేస్మెంట్ దశలో.. 4,547
రూప్ లెవల్‌లో.. 1,092
ఆర్‌సీ లెవెల్‌లో.. 236
పూర్తయిన ఇళ్లు 02