
ఆందోళనలో అన్నదాతలు
సాత్నాల: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. భారీ వర్షాలు, వరదలతో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కుమిలిపోతున్నా రు. జిల్లాలోని పెన్‌గంగా పరీవాహక ప్రాంతాలైన భీంపూర్, భోరజ్, జైనథ్, బేల, సాత్నాల మండలా ల్లో వేల ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. భీంపూర్ మండలంలో 1,016 ఎకరాల్లో పత్తి, 53 ఎకరాల్లో సోయాబీన్, 16 ఎకరాల్లో కంది పంట లకు నష్టం జరిగింది. బేల మండలంలో పత్తి 1,400, సో యాబీన్ 550, కంది 50, భోరజ్ మండలంలో పత్తి 1,880, సోయాబీన్ 353, కంది 68, సాత్నాల మండలంలో పత్తి 285, సోయాబీన్ 80, కంది 40, జైన థ్ మండలంలో పత్తి 1,200, సోయాబీన్ 1,200, కంది 160ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మానసిక ఒత్తిడికి లోనవుతూ..
పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పత్తి, సోయాబీన్, కంది పంటలు నాశనమై రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆర్థికంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు ఇప్పుడు పూర్తిగా విసిగిపోయారు. దిగుబడి రాదని ఆవేదనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భోరజ్ మండలంలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయిన నేపథ్యంలో ప్ర భుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పడంతో ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై స ర్వే చేసిన అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకుంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
భారీ వర్షాలతో ఇప్పటికే పంటలు కోల్పోయాం. రైతులకు ఆర్థికభారం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రబీ సాగు కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి. నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే
ఆదుకోవాలి. – పట్టెపు విలాస్, పెండల్‌వాడ
పరిహారం అందించాలి
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎరువులు, విత్తనాల ఖర్చులు వృథా అయ్యాయి. ఇప్పటికే ఎకరానికి రూ.15వేల ఖర్చయింది, ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలి. రబీ సాగుకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించి ఆదుకోవాలి. – సంతోష్‌రెడ్డి, పిప్పర్‌వాడ

ఆందోళనలో అన్నదాతలు