
బరితెగింపు!
తలమడుగు మండలం కొత్తూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని కారోబార్ ఫోర్జరీ చేశాడు. ఆయనతో పాటు 17మంది నిందితులు అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ గృహ పత్రాలు, పన్ను రశీదులు, బెయిల్ కోసం ప్రాపర్టీ షూరిటీలు ఇచ్చి దొరికిపోయారు.
ఆదిలాబాద్ పట్టణంలోని గంజ్‌రోడ్‌లో ఓ భవనాన్ని నలుగురు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో వారిపై టూటౌన్‌లో కేసు నమోదైంది.
ఇచ్చోడ మండలంలోని అడెగాం(బి)లో ఓటర్ల ప్రమేయం లేకుండా ఓట్లను బదిలీ చేశారు. ఫోర్జరీ పత్రాలు సమర్పించడంతో నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇచ్చోడ ఆర్‌ఐను నిందితుడిగా చేర్చారు.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించారు. వీరిపై వన్‌టౌన్‌లో కేసు నమోదైంది. వారిని అరెస్టు చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు సంబంధించిన ప్రభుత్వ రోడ్‌ను నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన నలుగురిపై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. తర్వాత కబ్జాను తొలగించి రోడ్డుపై రాకపోకలను పునరుద్ధరించారు.
మావల స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖానాపూర్‌లో కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన వారిపై కొరడా ఝుళిపించారు.
ఆదిలాబాద్‌రూరల్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టే ట్ దందాలో నకిలీ పత్రాలు సృష్టించిన మహిళ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇచ్చోడ స్టేషన్ పరిధిలో నకిలీ ఆధార్, నివాస ద్రువ పత్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు తయారు చేసిన 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
జిల్లాలో ఓ ముగ్గురు అక్రమార్కులు ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో గల రెడ్‌క్రాస్ సొసైటీకి సంబంధించిన స్థలాన్ని కాజేసేందుకు నకిలీ పత్రాన్ని సృష్టించారు. తాంసి మండలం పొన్నారికి చెందిన వ్యక్తితో పాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించారు. మున్సిపల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తప్పుడు పత్రాలు సమర్పించారు. రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఈ బాగోతం బయటపడింది. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే అక్రమార్కుల బరితెగింపు అర్థం చేసుకోవచ్చు.
ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం భూ కబ్జాలు, ఉద్యోగాల పేరిట మోసాలు వెలుగులోకి వస్తున్న ఘటనలు అక్రమార్కుల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీసులు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఫోర్జరీ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఖాళీస్థలాలను హస్తగతం చేసుకోవడం.. ఖాళీగా ఉన్న జాగాలో పాగా వేయ డం.. వ్యవసాయ భూములను కబ్జా చేసేందుకు బరితెగించడం.. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా వేసి నకిలీ పత్రాలు సృష్టించడం వంటివి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో తండ్రీ కొడుకులు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల స్టాంపులు తయారీతో పాటు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. ఏ పత్రాన్నైనా ఫోర్జరీ చేయడంలో సిద్ధహస్తులు. ఇటీవలే వారు పోలీసులకు చిక్కారు. అక్రమార్కులు ఫోర్జరీలకు పాల్పడుతూ కాసుల కో సం ఎంతకై నా తెగిస్తున్నారు. జిల్లాలో ఇటీవల వెలు గుచూసిన ఘటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో ఇవి సివిల్ కేసులుగా ఉండడంతో తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో ఉన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ బా ధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలో కొరడా ఝళిపించగా.. వారి బండారం బయటపడుతుంది.కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుండంతో బాధితులు ముందుకొస్తున్నారు. వారు ఎంతటి వారైనా పోలీసులు మాత్రం వదిలిపెట్టడం లేదు.
నకిలీ పత్రాలు సృష్టిస్తూ..
జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభు త్వ, అసైన్డ్ భూములు, ఖాళీగా ఉన్న ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆయా శాఖల్లో కొంత మంది అధికారులు, ఉద్యోగుల అండదండలతో ఫోర్జరీతో నకిలీపత్రాలు సృష్టిస్తున్నారు. పంచాయ తీ, మున్సిపాలిటీల్లో అక్రమ మార్గంలో ముటేషన్, అసిస్మెంట్ చేయించుకుంటున్నారు.ఆ తర్వా త ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి తీరా తమ పేరిట మార్చుకోవడం, అమాయకులకు ఆ భూ ములను విక్రయించడం పరిపాటిగామారింది. ఇటీవల బాధి తుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న పోలీసు అధి కారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.
ఆరు నెలల్లో జరిగిన సంఘటనలు..
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఎవరైనా ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినా, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినా కఠిన చర్యలు తప్పవు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీల దందా, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తే కేసులు నమోదు చేస్తాం. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరిగేలా చూస్తాం.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ