
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
కై లాస్‌నగర్: ఇంటర్మీడియెట్‌లో వందశాతం ఉత్తీ ర్ణతే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, సాంఘి క సంక్షేమ, గురుకుల, మోడల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారం వారం స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తూ, విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధన చేపట్టాలన్నారు. అలాగే యుడైస్, అపార్ నంబర్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఇందులో డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లైంగిక వేధింపుల నివారణకే పోక్సో చట్టం
ఆదిలాబాద్‌టౌన్: బాలికలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం రూపొందించబడిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఫోక్సో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలను ఏ ర్పాటుచేసి తరచూ విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో జిల్లా అదనపు జడ్జిశివరాం ప్రసాద్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, యూని సెప్ ప్రతినిధి డేవిడ్, ట్రస్మా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పవన్‌రావు, వి.ఆదినాథ్, దేవేందర్ పటా స్కర్, పురుషోత్తంరెడ్డి, అశోక్, సదాశివ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.