
‘ఆరోగ్య పాఠశాల’ పకడ్బందీగా నిర్వహించాలి
కై లాస్‌నగర్: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన మార్పుల కోసం చేపట్టిన ఆరోగ్య పాఠశాల, కళాశాల కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కార్యక్రమ అమలు తీ రుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లు కార్యక్రమ ప్రయోజనాలను వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రవర్తనలో వచ్చిన మార్పులను తమ సందేశాలు, డ్రాయింగ్స్ ద్వారా స్టూడెంట్ చాంపియన్లు వివరించారు. పట్టణంలోని బంగారుగూడ మోడల్ పాఠశాల పదో తరగతి విద్యార్థి జి.ప్రనూష్ ఆరోగ్య పాఠశాల ద్వారా చేకూరిన లబ్ధిని ఆంగ్లంలో అనర్గళంగా వివరించిన తీరుతో కలెక్టర్ మంత్ర ముగ్ధులయ్యారు. ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం స్టూడెంట్ చాంపియన్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిౖకై ెన వారిని శాలువాలతో సన్మానించారు. ఇందులో హెచ్‌ఎంలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
24 వరకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ
కై లాస్‌నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వరకు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇ.సుదర్శన్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తహసీల్దార్లకు ఆయన పలు సూచనలు చేశారు. బీఎల్‌వోలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ జాబితా పక్కాగా రూపొందించేలా శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.