
అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపుదాం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కల్తీకల్లు, గేమింగ్, ఓ పెన్ డ్రింకింగ్ తదితర అసాంఘిక కార్యకలా పాలను పూ ర్తిగా రూపుమాపుదామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారీ నేర స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గంజాయిరహిత జిల్లాగా మా ర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలా గే కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని అన్నా రు. వీడీసీ ఆగడాలు పూర్తిస్థాయిలో అరికట్టాల ని తెలిపారు. వడ్డీ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రా మాల్లో సమావేశాలు నిర్వహించి డీజేలు ఏర్పా టు చేయకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉత్త మ ప్రతిభ కనబర్చిన 30 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేసి ప్రోత్సహించనున్నట్లు తెలిపా రు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్,నాగేందర్, హసీ బుల్లా, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాజల్‌సింగ్‌కు పదోన్నతి చిహ్నం అలంకరణ
ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్‌కు గురువారం అదనపు ఎస్పీగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. ఈమేరకు నెలవారీ నేర సమీక్ష అనంతరం ఎస్పీ ఆమె భుజ స్కంధా లపై సింహ తలాటం చిహ్నం అలంకరించి అభినందనలు తెలిపారు.