
అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ
కై లాస్‌నగర్: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఎస్.రాజేశ్వర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం జిల్లాకు చేరుకున్న ఆయన నేరుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అక్కడి నుంచి డీఆర్డీఏ కార్యాలయంలో గల అధికారిక నివాసానికి చేరుకున్నారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నా రు. కమిషనర్ సీవీఎన్.రాజు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. బల్దియా ప్రత్యేకాధికారిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బల్దియాకు సమకూరుతున్న ఆస్తి పన్ను, శానిటేషన్ పరిస్థితిపై ఆరా తీశారు. మున్సిపల్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పథకాల పకడ్బందీ అమలుకు కృషి..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మార్గనిర్దేశం మేరకు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను పకడ్బందీగా అమలు చేసేలా కృషి చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వేగవంతం చేసేలా చూస్తానని తెలిపారు. అనంతరం కార్యాలయంలోని శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలతో పాటు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ చాంబర్లను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఉద్యోగులకు సూచించారు.