
ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం
కైలాస్‌నగర్: విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజ న్, బీసీ సంక్షేమాధికారి రాజలింగు, విశ్వకర్మ కులస్తులతో కలిసి విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సృష్టికి మూలం విశ్వకర్మ అని అన్నారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ విశ్వకర్మ యజ్ఞమహోత్సవం అధికా రికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ చిన్న విశ్వనాథ్, బోసిరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.