
సీఎంను కలిసిన ఎమ్మెల్యే శంకర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో విమానా శ్రయ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ విన్నవించారు. ఈమేరకు ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో బుధవారం కలిసి పలు అంశాలపై వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో 5,576 మంది రైతులు 8,566 ఎకరాల్లో పంటలు నష్టపోయారని వివరించారు. జిల్లాలో వెనుకబడిన వర్గాలతో పాటు గిరిజన జనా భా ఎక్కువగా ఉన్నందున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయాలన్నారు.