
తహసీల్దార్ కార్యాలయ భవనం
భయం గుప్పిట సిబ్బంది విధులు
శిథిలావస్థకు పలు కార్యాలయాలు
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. బీటలు వారిన గోడలు, పెచ్చులూడిన పైకప్పు నడుమ అధికారులు, సిబ్బంది భయంభయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి.
బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం ఇది. గోడలు బీటలు వారి స్లాబ్ పెచ్చులూడుతూ ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రవెల్లిలో శిథిలావస్థకు చేరిన అటవీశాఖ పాత కార్యాలయం ఇది. 1986లో నిర్మించారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చినా సరిపడా గదులు లేకపోవడంతో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఇక్కడే ఉండి విధులు నిర్వర్తించాల్సి వస్తోందని చెబుతున్నారు.
– కై లాస్‌నగర్/బేల/ఇంద్రవెల్లి

సిబ్బంది ఆందోళన

శిథిలావస్థకు చేరిన అటవీశాఖ పాత కార్యాలయం