
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ పీవో చాంబర్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆదిలాబాద్ మండలం మావలకు చెందిన గోదావరి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, జైనూర్ మండలం భూసిమెట గ్రామస్తులు సీసీరోడ్డు మంజూరు చేయాలని, ఉట్నూర్ మండలం ఛాప్రాలకు అంగన్‌వాడీ సెంటర్ మంజూరు చేయాలని అర్జీలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.