
35 శాతం లాభాల వాటా చెల్లించాలి
జైపూర్: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో నుంచి 35 శాతం కార్మికులకు చెల్లించాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఇందారం ఐకే1ఏ, ఐకే–ఓసీపీపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకుముందు జరిగిన స్ట్రక్చరల్ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్స్‌పై యాజమాన్యం ఇప్పటివరకు సర్క్యూలర్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ 12న జరగాల్సిన స్ట్రక్చరల్ సమావేశాన్ని బాయ్‌కట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే. బాజీసైదా, నాయకులు బాలకృష్ణ, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్, నర్సింగరావు, వెంకటేశ్, దేవేందర్, సత్తయ్య, నవీన్, పద్మరాజ్, శ్రీనివాస్, సతీశ్, సంజీవ్, యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.