
ప్రతిభ వెలికితీయాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అ న్నారు. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్‌లో బుధవారం జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. టీఎల్‌ఎం ద్వారా విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమన్న, డీఎస్‌డీవో శ్రీనివాస్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి తిరుపతి, రఘురమణ, డీసీఈబీ కార్యదర్శి గజేందర్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాస్థాయి మేళాలో మావల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల–2 ఉపాధ్యాయురా లు కవిత ప్రదర్శించిన ప్రదర్శన రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు మండల విద్యాధికారి సరోజ, ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ అవార్డు దక్కాలని ఆకాంక్షించారు.
డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన
పంటల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. ఆది లాబాద్‌రూరల్ మండలంలోని యాపల్‌గూడలో డిజిటల్ క్రాప్ సర్వే తీరును బుధవారం పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.