
జీపీవోలకు పోస్టింగ్
కైలాస్‌నగర్: గ్రామ పాలనాధికారులు వచ్చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 83 మందికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 82మంది హాజరుకాగా ఒక రు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 183 రెవెన్యూ క్లస్టర్ల వివరాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రకటిస్తూ మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న క్లస్టర్లకు పోస్టింగ్ కల్పించారు. సొంత నియోజకవర్గం, మండలంలో కాకుండా ఇతర క్లస్టర్‌కు 81 మందికి పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఆర్డర్లు అందుకు న్న వారు గురువారం సంబంధిత తహసీల్దార్‌కు రిపోర్టు చేసి కేటాయించిన క్లస్టర్ పరిధిలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఏసీబీ కేసులు ఎదుర్కొన్న వారి కి పోస్టింగ్ ఇవ్వవద్దని సీసీఎల్‌ఏ నుంచి అందిన ఆదేశాల మేరకు ఒకరికి ఆర్డర్స్ నిలుపుదల చేశారు. మరోకరు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో 81 మంది విధుల్లో చేరనున్నారు. ఈ ప్రక్రి య పూర్తి కావడంతో మరో 101 క్లస్టర్లకు ఇన్‌చార్జీ లను నియమించడంపై అధికారులు కసరత్తు చేపట్టనున్నారు. వారం వ్యవధిలోనే వారికి కూడా బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఏవో వర్ణ, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శైలజ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.