
‘ఏ టూ జడ్’పై 8 రోజుల సస్పెన్షన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు ఇ ష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు పై ‘సాక్షి’లో ప్రచురితమైన వ రుస కథనాలకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చర్యలు చేపట్టారు. ‘మెడికల్ మాయాజాలం’ శీర్షికన ఈనెల 8న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత ఏ టూ జడ్ మెడికల్ షాపును తనిఖీ చేసి నోటీసు జారీ చేశారు. ఆ శాఖ ఏడీకి ఈ విషయంపై నివేదిక అందజేశారు. దీంతో ఆయన ఎనిమిది రోజుల పాటు మెడికల్ షాప్ పై సస్పెన్షన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు. అలాగే ఒకరికి బదులు మరొకరు నిర్వహణ చేపట్టినా షాపు లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు.