
వీరనారి చాకలి ఐలమ్మ
ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని ఆదిలాబా ద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం అధికారికంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద గల ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రజక సంఘం నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణ సాయిధ పోరాటంలో ఐలమ్మ పోరాటపటిమను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు చిక్కాల దత్తు, సంతోష్, వినో ద్, భరత్, బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలా మున్నా, రఘుపతి, సచిన్,నిఖిల్ పాల్గొన్నారు.