
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఆదిలాబాద్‌రూరల్: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌రూరల్ పోలీసు స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించారు. ఆవరణలో ఉన్న వాహనాలకు సంబంధించిన కేసుల వివరాలు అడి గి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే దిశగా వారానికి కనీసం రెండుసార్లు పర్యటించాలన్నారు. సాయంత్రం సమయంలో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలను నివారించా లని సూచించారు. అలాగే రాత్రి గస్తీ పెంచాలన్నా రు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రానున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ కె.ఫణిదర్, ఎస్సై వి.విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.