
‘పరిషత్’ ఓటర్లు @ 4,49,981
పురుషులతో పోల్చితే మహిళలే అధికం అదనంగా మరో రెండు పోలింగ్ కేంద్రాలు తుది జాబితా విడుదల
కై లాస్‌నగర్: జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తే లింది. ప్రాదేశిక ఎన్నికల కసరత్తులో భాగంగా ప్ర భుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితాను జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి విడుదల చేశారు. జిల్లా పరిషత్‌తో పా టు ఎంపీడీవో కార్యాలయాల నోటీసుబోర్డులపై ప్ర దర్శించారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధి లో 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించా రు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313, ఇతరులు మరో 16 మంది ఉన్నా రు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 10,661 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం అదనంగా రెండు కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రెండు కేంద్రాలు పెంపు
ఓటర్ల సంఖ్యకనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముసాయిదా ప్రకారం జిల్లా వ్యా ప్తంగా 875 పోలింగ్ కేంద్రాలు ఉండగా రెండింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. బోథ్ మండలం కరత్వాడ జీపీ పరిధిలోని జిడిపల్లిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, మావల మండలం బట్టిసావర్‌గాంవ్‌లో మరో కేంద్రం ఏర్పాటు చేశారు.