
సమస్యలు సృష్టిస్తే చర్యలు
జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. చివరి విగ్రహం నిమజ్జనం పూర్తయ్యేదాకా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సమస్యలు సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం. డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించే ఆకతాయిలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ