
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న టీచర్లు
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లాకు చెందిన గురువులు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సూరజ్‌సింగ్ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం స్వీకరించారు. అనంతరం సీఎంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆదిలాబాద్‌లోని తెలంగా ణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల–బోథ్ ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ కూడా ఉత్తమ ప్రిన్సిపల్‌గా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతు ల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాల అ ధ్యాపకుల సమష్టి కృషి, అంకితభావంతోనే పురస్కారాలు వచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న టీచర్లు