
ఈ విధానం సాధ్యం కాదు
పీడీపీఎస్ విధానంలో వ్యాపారులే పత్తి కొనుగోలు చేయాలి. రూల్స్ ప్రకారం ఆదిలాబాద్ మార్కెట్‌కు పెద్దమొత్తంలో వచ్చే మొత్తం పత్తిని వ్యాపారులే కొనుగోలు చేయాలంటే సాధ్యం కాదు. రైతులు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని అడుగుతారు. మార్కెట్‌లో అమ్మిన తర్వాత ధర వ్యత్యాసాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆ నష్టాన్ని చెల్లిస్తుంది. అప్పటివరకు రైతులు ఆగే పరిస్థితి ఉండదు.
– రాజు చింతవార్, జిన్నింగ్ వ్యాపారి
పాత పద్ధతిలోనే కొనుగోళ్లు
పీడీపీఎస్ విధానంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు చర్చలు జరిగాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ విధానం అమలుపై ఎలాంటి స్పష్టత లేదు. గతంలో లాగే.. పాత పద్ధతిలో క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తాం.
– గజానన్,
మార్కెటింగ్ శాఖ అధికారి, ఆదిలాబాద్

ఈ విధానం సాధ్యం కాదు