
గడువు తీరిన మందుల విక్రేతపై చర్య తీసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: గడువు తీరిన మందులు విక్రయించిన మెడిక ల్ షాపు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ప ట్టణానికి చెందిన సయ్యద్ సాబీర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ సాబీర్ పట్టణంలోని కలెక్టరేట్ చౌక్‌లో గల ‘న్యూ ఏ టూ జెడ్’ ఫార్మసీలో గురువారం ఎల్డోక్స్రిన్ టాబ్లెట్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్‌ను పరిశీలించగా గత జనవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించాడు. దీనిని సదరు మెడికల్ షాపు యజమా ని దృష్టికి తీసుకువెళ్లగా, అతడు దానిని లాక్కునే ప్ర యత్నం చేసి వాగ్వాదానికి దిగినట్లు బాధితుడు ఆరోపించాడు. కాలం చెల్లిన మందులు విక్రయించడంతోపాటు తనతో అమర్యాదగా ప్రవర్తించిన మె డికల్ షాపు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని సయ్యద్ సాబీర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. మెడికల్ షాప్ సీజ్ చేయాలని కోరాడు.