
ఘనంగా ఓనం ఉత్సవాలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో శు క్రవారం ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యా రు. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు సంతోష్ శర్మ, మహేశ్, ఆలయ కమిటీ సభ్యులు వీరికి పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. ముందుగా వీరు ఆలయంలో అ య్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశా రు. ఓనం విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుంబోజీ సూర్యకాంత్, దాముక రవీందర్, మహేశ్, అన్నోజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.