కై లాస్‌నగర్: జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అన్ని మండలాల్లో ఎడతెరిపిలేకుండా కురిసింది. విద్యార్థులు, ఉద్యోగులు పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులకు అటంకం ఏర్పడింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు అలుగు దూకాయి. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇంద్రవెల్లిలో 51.5, ఆదిలాబాద్ అర్బన్‌లో 48.3, తాంసిలో 45.5, భోరజ్‌లో 44.5, మావల, బేల మండలాల్లో 43.5, గుడిహత్నూర్‌లో 40.5, భీంపూర్‌లో 39.5, జైనథ్, నార్నూర్‌లో 38.8, సాత్నాలలో 33.8, సిరికొండలో 33.3, తలమడుగులో 26.3, ఇచ్చోడలో 23.3, బేలలో 22.3, బజార్‌హత్నూర్‌లో 11.8, తలమడుగు, గాదిగూడలో 10.8, సొనాలలో 7.0, బోథ్‌లో 3.5. నేరడిగొండలో అత్యల్పంగా 2.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.