
బాధిత రైతులందరినీ ఆదుకోవాలి
కై లాస్‌నగర్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలపై వ్యవసాయాధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకో వాలని మాజీ మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి చేశా రు. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షాను బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశా రు. పంట నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా బ్యాంకర్లు రుణాలు అందించేలా చూడాలన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములను సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు తెలంగా ణ గ్రామీణ బ్యాంకు మినహా ఇతర బ్యాంకులు రుణాలివ్వడం లేదన్నారు. ఈమేరకు చొరవ చూ పాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు అజయ్, గణేష్, జగదీష్, తదితరులున్నారు.