
రైతులను ఆదుకోవాలి..
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. గతనెల 16, 18 తేదీల్లో వర్షాలు కురిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా సర్వే పూర్తి చేయలేకపోతున్నారు. నామ్‌కే వాస్తే కాకుండా ప్రతీ పంట క్షేత్రానికి వెళ్లి నష్టం అంచనా వేయాలి. పంట దెబ్బతిన్న రైతుకు ఎకరానికి రూ.25వేలు, భూమి కోతకు గురైన రైతుకు రూ.35వేల చొప్పున పరిహారం చెల్లించాలి. మంత్రులు ఇచ్చిన హామీ మేరకు త్వరగా పరిహారం అందించాలి. – సంగెపు
బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అద్యక్షుడు
ప్రభుత్వానికి నివేదిస్తాం..
జిల్లాలో భారీ వర్షాల కారణంగా 18వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు సర్వేలో తేలింది. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం. జిల్లాలో 12,338 మంది రైతులు పంటలు నష్టపోయారు. అత్యధికంగా పత్తి 14వేల ఎకరాల్లో, సోయాబీన్ 3,155 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.– శ్రీధర్ స్వామి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

రైతులను ఆదుకోవాలి..