
ఎన్‌సీసీతో దేశభక్తి పెంపు
ఆదిలాబాద్: ఎన్‌సీసీతో దేశభక్తి పెంపొందుతుందని అఫీషియేట్ గ్రూప్ కమాండింగ్ ఆఫీ సర్ కల్నల్ రాజేశ్‌కపూర్ అన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ వార్షిక సంయుక్త శిబిరాన్ని బుధవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఎన్‌సీసీలో చేరాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించి నైపుణ్యాలు పెంపొందించుకో వాలన్నారు. ఇందులో సీఓ విక్రమ్ ప్రతాప్ సింగ్, ఏవో అరవింద్ కిచ్చార్, జగ్ రామ్, అశోక్, ప్రశాంత్, రజిత, రాజేశ్వరి, ఆనంద్‌రావు, పూర్ణచందర్, శ్రీనివాస్, వినోద్ కుమార్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.