
ౖపైపెకి గంగమ్మ
ఇది నార్నూర్ మండలం మాన్కపూర్ పంచాయతీ శివారులోని రైతు కర్మాన్కర్ విఠల్ చేనులోని వ్యవసాయ బావి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇలా పూర్తిగా నిండిపోయింది. భూ ఉపరితలానికి సమాంతరంగా జలాలు పైకి వచ్చాయి. నీటిని చేతితో మనిషి సులువుగా తాకేందుకు వీలుగా ఉంది. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు బావులు ఇలాగే నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో అధిక వర్షాలు కురువడంతో భూగర్భజలాలు ౖపైపెకి వచ్చాయి. ప్రస్తుతం 1.71 మీటర్ల లోతుల్లోనే జలాల లభ్యత ఉంది. గత మే నుంచి ఇప్పటివరకు 10.12 మీటర్ల మేర పెరగడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలో గతనెలలో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 847.5 మి.మీ.లు కాగా, 1043.6 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది 23 శాతం అధికం. ఈ వర్షాలతో జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా తయారయ్యాయి.
ఇక్కడ పాయింట్ లోతులోనే..
జిల్లాలోని కొన్ని మండలాల్లో పాయింట్ లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉండటం గమనార్హం. గాదిగూడ మండలం అర్జునిలో 0.01 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు లభిస్తున్నాయి. భోరజ్‌లో 0.10, జైనథ్, నార్నూర్‌లలో 0.20, ఇచ్చోడలో 0.50, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్‌లో 0.75 మీటర్లలోనే ఉన్నాయి. ఈ రెండు చోట్ల మినహాయిస్తే జిల్లాలోని మిగతా అన్నిచోట్ల తక్కువ మీటర్ల లోతులోనే జలాల లభ్యత ఉండటం గమనార్హం.
భూ ఉపరితలం నుంచి జలాల
లభ్యత (మీటర్ల లోతులో)..
మే : 11.83 జూన్ : 9.05
జూలై : 4.00 ఆగస్టు : 1.71
తక్కువ లోతులోనే లభ్యత..
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజల మట్టం భారీగా పెరిగింది. గాదిగూడ మండలం అర్జునిలో పాయింట్ లోతులోనే జలాలు లభిస్తుండగా, బేల మండలం చాంద్‌పల్లిలో అధికంగా 6.25 మీటర్లు, భీంపూర్ మండలం అర్లిలో 4.85 మీటర్ల లోతులో లభ్యత ఉంది. – శ్రీవల్లి, ఏడీ,
భూగర్భజల శాఖ, ఆదిలాబాద్

ౖపైపెకి గంగమ్మ