
విద్యుత్ సమస్య పరిష్కరించాలి
నేరడిగొండ: మండలంలోని గుత్పాల గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్సీ) వైస్‌చైర్మన్ రాథోడ్ సందీప్ అన్నారు. గ్రామాన్ని మంగళవారం ఆయ న సందర్శించారు. అనంతరం మాట్లాడారు. గ్రామంలో ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్)పై అధిక లోడ్ కారణంగా తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుందన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇందులో మండల చైర్మన్ నర్సింగ్ దాస్, కోఆర్డినేటర్ కృష్ణ, లైన్‌మెన్ రణధీర్, గ్రామస్తులు ఉన్నారు.